పోర్ట్‌కు తరలిస్తున్న 26 లారీల బియ్యం పట్టివేత..

by Kodari Anjali |

నల్లగొండ పానగల్లు శివారు శ్రీనిధి పైపుల కంపెనీలో గుట్టుగా ఎఫ్‌సీఐకు సంబంధించిన దంపుడు (బాయిల్డ్ రైస్) బియ్యం అక్రమ తరలింపు చేస్తుండుగా విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

పోర్ట్‌కు తరలిస్తున్న 26 లారీల బియ్యం పట్టివేత..
X

దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ పానగల్లు శివారు శ్రీనిధి పైపుల కంపెనీలో గుట్టుగా ఎఫ్‌సీఐకు సంబంధించిన దంపుడు (బాయిల్డ్ రైస్) బియ్యం అక్రమ తరలింపు చేస్తుండుగా విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో సుమారు 26 లారీల దంపుడు బియ్యం ఆంధ్ర రాష్ట్రం కాకినాడ పోర్ట్ ఏరియాకు తరలించేందుకు ముఠా సిద్ధపడింది. ఎఫ్‌సీఐ గోదాంలో దంపుడు బియ్యం తీసుకువచ్చి నలగొండ శివారు ఓ పాత పైపుల కంపెనీలో గన్ని బ్యాగుల నుంచి బియ్యం తీసి పెద్ద బ్యాగులోకి సుమారు 20 బస్తాల బియ్యం అందులో వచ్చే విధంగా నింపుకొని లారీల్లో లోడ్ చేసి ఆంధ్రా రాష్ట్రానికి తరలింపుకు సిద్ధంగా ఉన్న లారీలను మరియు బియ్యంను నిలిపివేసి పూర్తి పత్రాలను నామ మాత్రపు తనిఖీలు చేసి విడుదల చేసినట్టు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా నామమాత్రపు తనిఖీలు చేసి వదిలిపెట్టడంతో సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిడిఎస్ బియ్యమా? లేక ఎఫ్‌సీఐ దంపుడు బియ్యం అనే కోణంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నత అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది.

Next Story