- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేబీఆర్ పార్కు చుట్టూ రెండవ వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీపీ సజ్జనార్
హెచ్-సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించిన రెండో వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హెచ్-సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించిన రెండో వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్, డీసీపీ కాజల్, జూబ్లీహిల్స్ జోన్ డీసీపీ రమణా రెడ్డి తదితర అధికారులతో కలిసి కేబీఆర్ పార్క్ గేట్, బసవతారకం ఆస్పత్రి, అగ్రసేన్ జంక్షన్, ఫిలింనగర్, రోడ్ నంబర్-45, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వంటి ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలను పర్యవేక్షించారు.
ప్రజలకు కీలక విజ్ఞప్తి
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన తొలి ట్రయల్ రన్‌లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకుంటూ రెండో వన్‌వే ట్రయల్ రన్‌ను చేపట్టినట్లు తెలిపారు. ట్రాఫిక్ ప్రవాహాన్ని మరింత సులభతరం చేయడం, నగర వాసులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. నగర అభివృద్ధి, ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా చేపడుతున్న ఈ మార్పులకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు.






