- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోడి కత్తితో వ్యక్తి దారుణ హత్య..
కోడి కత్తితో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన చుంచుపల్లి మండలంలోని అంబేద్కర్ నగర్‌లో జరిగింది.

X
దిశ, కొత్తగూడెం: చుంచుపల్లి మండలంలోని అంబేద్కర్ నగర్‌లో శనివారం రాత్రి రాత్రి జరిగిన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు నాగరాజుగా గుర్తించారు. స్థానికుల సమాచారం ప్రకారం, పెద్దమ్మ గుడి సమీపంలో నాగరాజుకు శివాజీ అనే వ్యక్తితో శనివారం రాత్రి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నాగరాజు ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనంతరం రాత్రి సమయంలో శివాజీ కోడి కత్తితో నాగరాజుపై దాడి చేసినట్లు తెలుస్తుంది. తీవ్రంగా గాయపడిన నాగరాజును గ్రామస్తులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. మృతుడికి ఒక సోదరి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. హత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
Next Story






