“నాన్నంటే రెండు అక్షరాలు కాదు.. ఆయనొక దైవం

by Kodari Anjali |

పితృ దినోత్సవాన్ని పురస్కరించుకొని గోరంట్ల గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు రాచకొండ ప్రభాకర్ వినూత్న తరహాలో ప్రచారం చేపట్టారు.

“నాన్నంటే రెండు అక్షరాలు కాదు.. ఆయనొక దైవం
X

దిశ, తుంగతుర్తి: పితృ దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు రాచకొండ ప్రభాకర్ ఆదివారం వినూత్న తరహాలో ప్రచారం చేపట్టారు.పేదరికంతో కష్టాన్నే నమ్ముకొని సాధారణ రీతిలో సంసార జీవితాన్ని గడిస్తున్న వేషధారణతో ప్రభాకర్ “పితృవేదన” తో కూడిన మైక్, బ్యానర్ ను చేత పట్టుకొని జన సమూహ ప్రాంతాల్లో ప్రచారం సాగిస్తున్నారు. సొంత ఖర్చులతో కరపత్రాలను ముద్రించి పంపిణీ చేశారు. నాన్న అడుగు జాడలో నడవాలని, నాన్నంటే కేవలం రెండు అక్షరాల పదం కాదని తన సందేశంలో పేర్కొంటున్నారు. నాన్న ఒక దైవం, కష్టాన్ని సుఖంగా భావిస్తూ తన పిల్లల ఉన్నత భవిష్యత్తుకు దారి చూపుతారని వివరిస్తున్నారు. ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా భవిష్యత్తులో గౌరవంతో కూడిన ఉన్నత స్థిరత్వంగా పిల్లలు ఉన్ననాడే తండ్రి సంతోషిస్తాడని పేర్కొనడమే కాకుండా పిల్లలు "అదే తండ్రికి ఇచ్చే కానుక" అంటూ వివరించారు. కొంతమంది పిల్లలు జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలు, డ్రగ్స్ గంజాయి వంటి వాటితో తల్లిదండ్రులను క్షోభ పెడుతున్న సందర్భంగా "పితృ వేదన" అనే ట్యాగ్‌తో ఈ ప్రచారాన్ని చేపట్టినట్లు ప్రభాకర్ తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వివిధ రకాల మార్కెట్ మార్కెట్‌లలో జన సమర్థం ఉన్న ప్రాంతాలలో ప్రభాకర్ చేసిన ప్రచారం అందరిని ఆలోచింపజేసింది.

Next Story