కేటీఆర్‌కు పనిలేక పర్యటనలు.. మళ్లీ రేవంతే సీఎం: మేడిపల్లి సత్యం కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

కేటీఆర్ ప‌ని పాట లేకుండా ప‌ర్యట‌న‌లు చేస్తున్నారని, కేటీఆర్ అస‌న‌హ‌నంలో నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే, మేడిపల్లి సత్యం మండిపడ్డారు.

కేటీఆర్‌కు పనిలేక పర్యటనలు.. మళ్లీ రేవంతే సీఎం: మేడిపల్లి సత్యం కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్ ప‌ని పాట లేకుండా ప‌ర్యట‌న‌లు చేస్తున్నారని, కేటీఆర్ అస‌న‌హ‌నంలో నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే, మేడిపల్లి సత్యం మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు ఖాయమని, మ‌ళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే, బీఆర్ఎస్ కు డిపాజిట్లు రాదు, ప్రతిప‌క్ష హోదా కూడా ద‌క్కదని మేడిపల్లి సత్యం ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్, మా సినిమా ఫ‌స్టు హాఫ్ సూప‌ర్ హిట్ అయింది.. సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్, బంపర్ హిట్ హిట్టు అవుతుందన్నారు. సెకండ్ హాఫ్ లో మీకు బొమ్మ చూపిస్తామని, ఇప్పటికే అరాచ‌క‌, అవినీతి పాల‌న‌పైన తెలంగాణ ప్రజ‌లు ఎదురుతిరిగి బీఆర్ఎస్ కు బొమ్మ చూపించారని మేడిపల్లి సత్యం ఎద్దేవా చేశారు. దేశంలో ఏ సీఎం చేయ‌న‌ట్లుగా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారని, రేవంత్ రెడ్డి రెన్యువ‌ల్ సీఎం అని కేటీఆర్ అంటున్నాడని, ప్రతి ఐదేళ్ల ఒక సారి తెలంగాణ ప్రజ‌ల‌తో రెన్యువ‌ల్ చేయించుకుని సీఎంగా కొన‌సాగుతూనే ఉంటారన్నారు.

ప‌దేళ్ల పాల‌న‌లో తెలంగాణ‌ను క‌ల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా విభ‌జించుకుని దండుపాళ్యం బ్యాచ్‌లా దోచుకున్నారని, క‌ల్వకుంట్ల కుటుంబం సొంత ఆడ‌బిడ్డ క‌విత‌నే చెపుతోందని మేడిపల్లి సత్యం ఆరోపించారు. మీ కుటుంబ స‌భ్యురాలే మీ పాల‌న‌ను, మీ పార్టీని స‌మ‌ర్థించ‌డం లేదని, ఇక తెలంగాణ ప్రజ‌లు ఎందుకు ప‌ట్టించుకుంటారని ఆయన నిలదీశారు. బాధ్యతాయుత‌మైన ప్రతిప‌క్షంగా నిర్మాణాత్మక స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాలని, కానీ, ఎందుకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడ‌న్న అస‌హ‌నం, అహంకారం మీలో క‌నిపిస్తోందన్నారు. కేటీఆర్ నీలాగా ఎక్కడో చదువుకుని వ‌చ్చి రేవంత్ రెడ్డి మేనేజ్మెంట్ కోటాలో సీఎం కాలేదని, కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎదిగి సీఎం అయ్యాడన్నారు. ప్రజ‌ల అభిమానంతో అతి త‌క్కువ స‌మ‌యంలో సీఎం అయితే క‌ల్వకుంట్ల కుటుంబం అసూయ‌, ద్వేషంతో రగిలిపోతున్నారని, బాధ్యతాయుత‌మైన ప్రతిప‌క్షంగా ఇప్పటికైనా వ్యవ‌హారించ‌క‌పోతే భ‌విష్యత్తులో మీ పార్టీకి డిపాజిట్లు కూడా ద‌క్కవని మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు.

Next Story