- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్.. మీలో ఆ సమస్య ఉండొచ్చు!
రక్తహీనతవల్ల పిల్లల్లో మట్టి, సున్నం, చాక్ పీస్ వంటివి తినాలనే కోరికలు పుడుతుంటాయి. దీంతో ఆహారం తినడానికి ఆసక్తి చూపకపోవచ్చు.

దిశ, ఫీచర్స్ : తేలికపాటి తలనొప్పి తరచుగా వేధిస్తోందా? ఎక్కువసేపు నడిస్తేనో, కొద్దిగా పరుగెడితేనో కళ్లు తిరిగినట్లు అనిపిస్తోందా? నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవడం బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. శరీరంలో తగినంత రక్తం లేకపోయినా ఈ లక్షణలు కనిపిస్తాయని చెబుతున్నారు. అలాగే నిర్లక్ష్యం చేస్తే రక్తహీతకు, ఇతర అనారోగ్యాలకు దారితీయవచ్చు. ఇంకా ఏయే లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హార్ట్‌బీట్‌లో మార్పులు.. నిద్రలేమి
హెల్తీగా ఉండాలంటే.. శరీరంలో తగినంత రక్తం ఉండాలి. ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడంవల్ల ఇది సాధ్యం అవుతుంది. అయితే వాటి పనితీరు మందగించినప్పుడు, సరిగ్గా రక్తాన్ని ఉత్పత్తి చేయలేవు. దీనివల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు తరచుగా తలనొప్పి రావడం, కళ్లు తిరగడం, నిద్రపట్టకపోవం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొందరిలో ఛాతీలో నొప్పిగా అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం జరగవచ్చు. అంతేకాకుండా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఏకాగ్రత లోపించడం, తరచుగా అలసట, చిన్న చిన్న పనులకే నీరసించిపోవడం, జుట్టు రాలడం వంటి సింప్టమ్స్ రక్తహీతన ఉన్నవారిలో సాధారణంగా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు రక్తాన్ని ప్రొడ్యూస్ చేయగల పోషకాహారాలు తీసుకోవడం ద్వారా రికవరీ కావచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కాళ్లల్లో తిమ్మిరి, పిల్లల్లో వింత కోరికలు
రక్తహీనతవల్ల పిల్లల్లో మట్టి, సున్నం, చాక్ పీస్ వంటివి తినాలనే వింత కోరికలు పుడుతుంటాయి. దీంతో ఆహారం తినడానికి ఆసక్తి చూపకపోవచ్చు. కొందరు పెద్దల్లోనూ ఇలాంటి కోరికలు కలుగవచ్చు. అంతేకాకుండా తరచుగా కాళ్లు, చేతులు అకారణంగా తిమ్మిరి పట్టడం, అకారణంగా వణకడం వంటి లక్షణాలు ఉంటాయి. మరి కొందరు రాత్రిపూట తరచుగా కాళ్లను కదిలిస్తూనే ఉంటారు. దీనిని రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. రక్తహీనత ఉన్నవారిలో, బాడీలో ఐరన్ లోపం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకొని వైద్య నిపుణుల సలహాలను పాటించాలి. ఆహారాల విషయానికి వస్తే నట్స్, ప్రూన్, పచ్చి బఠానీలు, తృణ ధాన్యాలు, పాలు, గుడ్లు, మాంసం, ఆఫ్రికాట్, బ్రోకలీ, ఎండు ద్రాక్షతోపాటు సీజనల్ కూరగాయలు, పండ్లు వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవడంవల్ల రక్తహీతను అధిగమించవచ్చు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






