రామ్ పోతినేనితో రిలేషన్‌షిప్.. హైదరాబాద్ నా రెండో ఇల్లు అంటూ హింట్ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే

by Mallepaka Hamsa |

తన మొదటి ఇల్లు ఔరంగాబాద్ అయినప్పటికీ హైదరాబాద్‌తో తనకు ఎంతో స్పెషల్ బాండింగ్ ఉందని చెప్పారు. అంతేకాకుండా ఇప్పటికే తనకు ఇక్కడ ఒక ఇల్లు కూడా ఉందని ఆమె వెల్లడించారు

రామ్ పోతినేనితో రిలేషన్‌షిప్.. హైదరాబాద్ నా రెండో ఇల్లు అంటూ హింట్ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇటీవల రామ్ పోతినేని సరసన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయం నుంచే రామ్, భాగ్యశ్రీల మధ్య ఏదో నడుస్తోందంటూ సోషల్ మీడియాలో పలు పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ నెట్టింట వార్తలు వస్తున్నప్పటికీ.. ఈ జంట మాత్రం ఇప్పటివరకు దీనిపై అధికారికంగా స్పందించలేదు. ఎవరి పనిలో వారు బిజీగా ఉంటూ సైలెంట్‌గా ఉంటున్నప్పటికీ, వీరి రిలేషన్‌షిప్‌పై నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ బోర్సే చేసిన వ్యాఖ్యలు రామ్‌తో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉందనే పుకార్లకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. భాగ్యశ్రీ తన మనసులోని మాటను బయటపెడుతూ.. తన మొదటి ఇల్లు ఔరంగాబాద్ అయినప్పటికీ హైదరాబాద్‌తో తనకు ఎంతో స్పెషల్ బాండింగ్ ఉందని చెప్పారు. అంతేకాకుండా ఇప్పటికే తనకు ఇక్కడ ఒక ఇల్లు కూడా ఉందని ఆమె వెల్లడించారు.

భాగ్యశ్రీ హైదరాబాద్‌లో సొంత ఇల్లు తీసుకున్న విషయం చెప్పగానే పక్కనే ఉన్న యాంకర్ సుమ ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలపడం విశేషం. భాగ్యశ్రీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రామ్ పోతినేనితో ఉన్న ప్రేమ వల్లే ఆమె హైదరాబాద్‌లో ఇల్లు కొని సెటిల్ అవ్వాలని చూస్తోందంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. భాగ్యశ్రీ కేవలం రామ్‌కు దగ్గరగా ఉండటం కోసమే ఇక్కడ ఇల్లు తీసుకుందని, త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని చర్చించుకుంటున్నారు. కాగా.. భాగ్యశ్రీ బోర్సే సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘లెనిన్’ అనే క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

Next Story