- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NSE: ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్
ముసాయిదా పత్రాల ప్రకారం, భారత క్యాష్ మార్కెట్, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్ విభాగాల్లో ఎన్‌ఎస్‌ఈ అగ్రగామిగా కొనసాగుతోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తన ఐపీఓ ప్రక్రియలో కీలక అడుగు వేసింది. సంస్థ తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ను సెబీకి సమర్పించింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఉండగా, ఎస్‌బీఐ, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, జీఐసీ, న్యూ ఇండియా అష్యూరెన్స్ వంటి వాటాదారులు దాదాపు 14.89 కోట్ల షేర్లు, అంటే కంపెనీ ఈక్విటీలో సుమారు 6 శాతం వాటాను విక్రయించనున్నారు. ముసాయిదా పత్రాల ప్రకారం, భారత క్యాష్ మార్కెట్, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్ విభాగాల్లో ఎన్‌ఎస్‌ఈ అగ్రగామిగా కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ కార్యకలాపాల ఆదాయం రూ.16,601 కోట్లకు, నికర లాభం రూ.10,302 కోట్లకు చేరుకుంది. రోజుకు 1,200–1,400 కోట్ల ఎస్సెమ్మెస్‌లను ప్రాసెస్ చేసే సాంకేతిక సామర్థ్యంతో, 3,699 కోట్ల కాంట్రాక్టులు ట్రేడ్ అవడంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఈక్విటీ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈ కొనసాగుతోంది. ఐపీఓ అనంతరం ఎన్‌ఎస్‌ఈ షేర్లు బీఎస్‌ఈలో మాత్రమే లిస్ట్ కానున్నాయి.






