- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూటీని ఢీకొన్న డీసీఎం వ్యాన్.. వ్యక్తి మృతి
మాడుగులపల్లి మండలంలోని కుక్కడం వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.

దిశ, మాడుగులపల్లి: మాడుగులపల్లి మండలంలోని కుక్కడం వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డికుంట ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల ప్రజ్ఞాపురం బిక్షపతిగా గుర్తించారు. మిర్యాలగూడ నుండి నల్గొండ వైపు స్కూటీపై వెళ్తున్న బిక్షపతి ను వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక డీసీఎం వ్యాన్ బలంగా ఢీకొట్టడంతో వ్యక్తి వాహనం కింద పడడంతో తలపై నుండి దూసుకెళ్లింది.ఆయన హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న మాడుగులపల్లి ఎస్సై ఎస్ కృష్ణయ్య తన సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.






