తెలంగాణ వాదం విఫలమైంది.. డా.విశారదన్ మహారాజ్ హాట్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2026-06-21 12:21:37  IST  )

తెలంగాణ వాదం పూర్తిగా విఫలమైందని ధర్మ సమాజ్ పార్టీ చీఫ్ డా.విశారదన్ మహారాజ్ అన్నారు.

తెలంగాణ వాదం విఫలమైంది.. డా.విశారదన్ మహారాజ్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వాదం నూటికి నూరు పాళ్లు విఫలం అయిందని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.విశారదన్ మహారాజ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఆలోచన రాకుండా రాజకీయ పార్టీలు ఒక్కో కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వం రాజ్యాధికారం అనుభవించిన, అనుభవిస్తున్న వారికి కాదని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కావాలన్నారు. తెలంగాణ వాదానికి నాయకత్వం బడుగు, బలహీన వర్గాలదన్నారు. డీఎస్పీ పార్టీ మద్దతుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ మహబూబ్ నగర్‍లో సామాజిక న్యాయం-రాజ్యాధికారంకై ఎవరి కులం ఎంతో వారికంత వాటా అనే కార్యక్రమంలో మాట్లాడిన ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీల రక్తం తాగిన భూస్వాములను తెలంగాణ వాదం ముసుగులో కేసీఆర్ అడ్డుగా నిలబడ్డారని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలను వేధించిన భూస్వాములపై కేసీఆర్, బీజేపీ, ఎందుకు యుద్ధం చేయలేదని ప్రశ్నించారు.

మన శత్రువు మన గ్రామంలోనే ఉన్నాడు:

మన నెత్తురు తాగిన శత్రువు ఎక్కడో లేడని మన గ్రామాల్లోనే ఉన్నారని వారిని పట్టుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఆలోచన వస్తే అధికారం వస్తుందని అందుకే గ్రామాల్లో మన నాయకులు కావాలని పిలుపునిచ్చారు. రెడ్లపై పగ బట్టి చంద్రబాబు అధికారంలోకి వస్తే కమ్మవారిపై యుద్ధం చేసి రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారని అన్నారు. వీరిపై పోరాటం చేసి వెలమ దొర కేసీఆర్ అధికారంలోకి వస్తే వీరిని మింగడానికి రేవంత్ రెడ్డి పోరాటం చేసి అధికారంలోకి వచ్చారని అన్నారు. ఎవరికి ఆత్మగౌరవం ఉంటే వారికి రాజ్యం వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అనే కత్తితో నిలువునా రేవంత్ రెడ్డిని కోస్తామన్నారు.

Next Story