వ్యవసాయ కూలీలతో ముచ్చటించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..

by Kodari Anjali |

కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలను కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

వ్యవసాయ కూలీలతో ముచ్చటించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..
X

దిశ, మునగాల: మునగాల మండల పరిధిలోని నర్సింహుల గూడెంలో గ్రామంలో గంగమ్మ & కాటమయ్య పండుగ కార్యక్రమంలో భాగంగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మార్గమధ్యంలో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలను కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉపాధి పరిస్థితుల గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి అందుతున్న తీరుపై ఆరా తీశారు. కూలీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వ్యవసాయ కూలీలు తమ సమస్యలను వివరించి సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన పద్మావతి రెడ్డి.. ఈ సందర్బంగా నరసింహుల గూడెంలో సర్పంచ్ కుంచం ఇందిరా నరసయ్య ఏర్పాటు చేసిన సోలార్ వీది లైట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నల్లపాటి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు కొప్పుల జాపాల్ రెడ్డి, ఉప్పుల జానకి రెడ్డి, మాజీ ఎంపిటిసి విజయలక్ష్మి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story