బూమర్ తింటున్నాడని విద్యార్థిపై టీచర్ ప్రతాపం

by Taduka Kalyani |

బూమర్ తింటున్నాడని విద్యార్థిపై ఉపాధ్యాయుడి ప్రతాపం చూపడంతో తలకు, చేతికి గాయాలైన ఘటన తాండూరు మండలం కరణ్‌కోట్ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.

బూమర్ తింటున్నాడని విద్యార్థిపై టీచర్ ప్రతాపం
X

దిశ, తాండూర్ రూరల్: బూమర్ తింటున్నాడని విద్యార్థిపై ఉపాధ్యాయుడి ప్రతాపం చూపడంతో తలకు, చేతికి గాయాలైన ఘటన తాండూరు మండలం కరణ్‌కోట్ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...కరణ్‌కోట్ గ్రామానికి చెందిన తెలూకూరు చిట్టెమ్మ, పాండు దంపతుల కుమారుడు మణికంఠను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యాభాసం చేయిస్తున్నారు. శనివారం పాఠశాలకు వచ్చిన విద్యార్థి మణికంఠ క్లాసు రూములో బూమర్ వేసుకుని నములుతున్నాడు. గమనించిన టీచర్ రజనీ బూమర్ ఎందుకు తింటున్నావని కోపంతో మణికంఠను చితకబాదింది. దీంతో విద్యార్థి తలకు, ఎడమ చేతికి తీవ్రమైన గాయాలయ్యాయి. అదే గాయాలతో విద్యార్థి మణికంఠ ఇంటికి వెళ్లాడు. వెంటనే తండ్రి పాండు మణికంఠను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. జరిగిన సంఘటనపై కరణ్‌ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తండ్రి పాండు తెలిపాడు. విద్యార్థిని చితక బాదిన సంఘటనపై పాఠశాల నుంచి ఎలాంటి వివరణ రాలేదు.

Next Story