- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన యువకునిపై కేసు నమోదు
రాంగ్ రూట్ లో కారును నడుపుతు ఆర్టీసీ డ్రైవర్ పై ఓ వాహనదారుడు కట్టెతో దాడి చేశాడు. ఈ సంఘటన శనివారం ఉదయం రాజేంద్రనగర్ సర్కిల్ పీడీపీ చౌరస్తా పిల్లర్ నెంబర్ 215 వద్ద జరిగింది.

దిశ, రాజేంద్రనగర్: రాంగ్ రూట్ లో కారును నడుపుతు ఆర్టీసీ డ్రైవర్ పై ఓ వాహనదారుడు కట్టెతో దాడి చేశాడు. ఈ సంఘటన శనివారం ఉదయం రాజేంద్రనగర్ సర్కిల్ పీడీపీ చౌరస్తా పిల్లర్ నెంబర్ 215 వద్ద జరిగింది. ఈ సంఘటన సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. వివరాలు ఈ విదంగా ఉన్నాయి.. రాజేంద్రనగర్ ఆర్టీసీ బస్సు డిపో కు చెందిన గోపాల్ అనే డ్రైవర్ పీడీపీ చౌరస్తా లో తాను నడుపుతున్న బస్సును కరెక్ట్ గానే తీసుకువెళుతున్నాడు. రాంగ్ రూట్ లో కారు నడుపుతు వచ్చిన ఓ యువకుడు ఆర్టీసీ డ్రైవర్ గోపాల్ ను కట్టెతో దాడి చేశాడు. ఈ విషయాన్ని గోపాల్ ద్వారా తెలుసుకున్న రాజేంద్రనగర్ ఆర్టీసీ బస్సు డిపో మేనేజరు బి క్రిష్ణారెడ్డి సదరు యువకుని పై రాజేం ద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ సుమన్ దర్యాప్తు చేసు న్నారు.
ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తిని గుర్తించి కఠినంగా శిక్షించాలి : నెటిజన్లు
పీడీపీ చౌరస్తా లో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన యువకుని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆర్డీసీ డ్రైవర్లతో పాటు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం సరికాదన్నారు.






