- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం మత్తు విషాదం.. రైలు ఢీకొని వ్యక్తి మృతి
మోమిన్‌పేట్ మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామ శివారులో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

దిశ, మోమిన్‌పేట్ : మోమిన్‌పేట్ మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామ శివారులో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎన్కేపల్లి గ్రామానికి చెందిన దాసరి రాజు (40), తండ్రి చంద్రయ్య, కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి మద్యం మత్తులో భార్యతో గొడవపడిన రాజు ఇంటి నుంచి బైక్‌పై వెళ్లిపోయి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల వెతుకుతుండగా గ్రామ శివారులోని రైల్వే పట్టాలపై అతని మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో ఎన్కేపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య, ఇద్దరు చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉండగా, కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






