అరుదైన ప్రకృతి వింత.. తమిళనాడులో కనిపించిన టోర్నడో

by Ramesh Naini |

తమిళనాడులో అత్యంత అరుదుగా కనిపించే వింత వాతావరణ దృశ్యం ఆవిష్కృతమైంది.

అరుదైన ప్రకృతి వింత.. తమిళనాడులో కనిపించిన టోర్నడో
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో అత్యంత అరుదుగా కనిపించే వింత వాతావరణ దృశ్యం ఆవిష్కృతమైంది. తూత్తుకుడి జిల్లాలో ఆదివారం అరుదైన టోర్నడో (సుడిగాలి) కనిపించి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. నల్లటి ఉరుము-మెరుపుల మేఘాల నుంచి నేలను తాకేలా ఏర్పడిన ఈ సుడిగాలి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాతావరణ నిపుణులు దీనిని బలహీనమైన ‘ల్యాండ్‌స్పౌట్ టోర్నడో’గా గుర్తించారు. టోర్నడోలు సాధారణంగా ఉరుము-మెరుపులతో కూడిన భారీ మేఘాల నుంచి ఏర్పడే వేగంగా తిరిగే గాలి స్తంభాలు. భారతదేశంలో ఇవి చాలా అరుదుగా సంభవిస్తాయి.

ఎక్కువగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోనే నమోదవుతుంటాయి. తమిళనాడులో టోర్నడో కనిపించడం అత్యంత అరుదైన ఘటనగా వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో ఎలాంటి భారీ ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదు. అయితే బలహీనమైన టోర్నడో అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తూత్తుకుడిలో కనిపించిన ఈ సుడిగాలి రాష్ట్ర చరిత్రలోనే అత్యంత అరుదైనదిగా వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Next Story