- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కాంగ్రెస్ గల్ఫ్ ప్రతినిధుల భేటీ
తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ ప్రతినిధి సుతారి సత్యనారాయణ పటేల్, తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి.. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆదివారం భేటీ అయ్యారు.

- ఎన్నారైల ఓటు హక్కుల పరిరక్షణపై చర్చ
- గల్ఫ్ దేశాల్లో పర్యటించాలని మంత్రి పొన్నం నిర్ణయం!
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ ప్రతినిధి సుతారి సత్యనారాయణ పటేల్, తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి.. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆదివారం భేటీ అయ్యారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) జరుగుతున్న నేపథ్యంలో విదేశాల్లో నివసిస్తున్న 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగింపునకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ ఓటరు నమోదును కొనసాగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రిని కోరారు. జూమ్ సమావేశాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు, గల్ఫ్ కార్మికులను ప్రత్యక్షంగా కలిసేందుకు గల్ఫ్ దేశాల్లో పర్యటించాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. గల్ఫ్ దేశాల్లో పర్యటించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖత వ్యక్తం చేశారు.






