సియాచిన్ మంచు శిఖరాలపై ఆర్మీ డాగ్స్ అరుదైన యోగా

by Ramesh Naini |

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రంగా పేరుగాంచిన సియాచిన్ మంచు శిఖరాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారత సైన్యం ప్రత్యేకంగా నిర్వహించింది.

సియాచిన్ మంచు శిఖరాలపై ఆర్మీ డాగ్స్ అరుదైన యోగా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రంగా పేరుగాంచిన సియాచిన్ మంచు శిఖరాల (Siachen Glacier)లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారత సైన్యం ప్రత్యేకంగా నిర్వహించింది. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, క్లిష్ట వాతావరణ పరిస్థితుల మధ్య 18,000 అడుగుల ఎత్తులో సైనికులు, వారి శిక్షణ పొందిన ‘సియాచిన్ స్నిఫర్స్’ ఆర్మీ డాగ్స్ యోగాసనాలు చేసి ఆకట్టుకున్నారు. సైనికులు, డాగ్స్ హ్యాండ్లర్లు కలిసి యోగా సాధన చేయడం ద్వారా మానసిక దృఢత్వం, శారీరక ఆరోగ్యం, ఏకాగ్రత పెంపొందించుకోవచ్చని సందేశం ఇచ్చారు.

సైనికులు-ఆర్మీ డాగ్స్ మధ్య బంధం

మంచు శిఖరాల నడుమ జరిగిన ఈ కార్యక్రమం సైనికులు-ఆర్మీ డాగ్స్ మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని, ప్రతికూల పరిస్థితుల్లోనూ వారి క్రమశిక్షణ, సహనాన్ని ప్రతిబింబించింది. అలాగే లడఖ్ (Ladakh)లోని లేహ్, కార్గిల్, పాంగాంగ్ సో, గల్వాన్, మార్సిమిక్ లా తదితర ఎత్తైన ప్రాంతాల్లోనూ సైనిక దళాలు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాయి. యోగా ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని సైన్యం పేర్కొంది.

Next Story