మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన ఏజెండా.. ఎమ్మెల్యే మర్రి

by Batti.Sumithra |

ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన ప్రధానఆ లక్ష్యంగా ముందుకు పోతున్నామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు.

మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన ఏజెండా.. ఎమ్మెల్యే మర్రి
X

దిశ, అల్వాల్: ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన ప్రధానఆ లక్ష్యంగా ముందుకు పోతున్నామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం సుభాష్ నగర్ లో రూ. 6. 42 లక్షలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పైపులైన్ల పనులను మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రానున్న రోజులను అభివృద్ధి అంటేనే మల్కాజిగిరి నియోజకవర్గం అనే విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story