- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఒత్తిడి లేదు.. ప్రణాళికలు అమలు చేశానంతే!’ విమర్శకులకు బ్యాట్‌తోనే బదులిచ్చిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్‌లో సంచలనంగా వెలుగులోకి వచ్చిన 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్‌లో సంచలనంగా వెలుగులోకి వచ్చిన 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చాడు. ముక్కోణపు సిరీస్ తొలి మూడు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, శ్రీలంక A ప్లేయర్లతో గొడవకు దిగిన వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొన్న వైభవ్, ఆదివారం శ్రీలంక ‘ఏ’తో జరిగిన ఫైనల్లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు (10 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి భారత్ ‘ఏ’ విజయానికి ప్రధాన కారణమయ్యాడు. ఫైనల్లో తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు. ఈ ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన వైభవ్..
మ్యాచ్ అనంతరం మాట్లాడిన వైభవ్, ‘ఎలాంటి ఒత్తిడి అనిపించలేదు. తొలి 10 ఓవర్లను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను. గత మ్యాచ్‌ల్లో నా ప్రణాళికలను అమలు చేయలేకపోయాను. ఫైనల్‌కు ముందు కోచ్‌లతో మాట్లాడి అదే అమలు చేశాను’ అని తెలిపాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటికే చాలానే మ్యాచ్‌లు ఆడానని, అయితే భిన్నమైన పిచ్‌లు, పరిస్థితుల్లో ఆడటం మంచి అనుభవంగా నిలిచిందని పేర్కొన్నాడు.
66 పరుగుల తేడాతో ఘన విజయం..
దంబుల్లా వేదికగా జరిగిన ఈ ఫైనల్ పోరులో భారత్ ‘ఏ’ 66 పరుగుల తేడాతో శ్రీలంక ‘ఏ’ను చిత్తు చేసి టైటిల్ ఎగరేసుకుపోయింది. సూర్యవంశీ వీర విహారానికి తోడు కెప్టెన్ తిలక్ వర్మ (90 బంతుల్లో 67), అనుకుల్ రాయ్ (15 బంతుల్లో 39) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక 47.1 ఓవర్లలో 311 పరుగులకే కుప్పకూలింది.
అద్భుతంగా పుంజుకున్నాం: కెప్టెన్ తిలక్ వర్మ
టోర్నీలో తమ ప్రయాణంపై కెప్టెన్ తిలక్ వర్మ హర్షం వ్యక్తం చేశాడు. అఫ్ఘానిస్తాన్, శ్రీలంక (సూపర్ ఓవర్) చేతిలో లీగ్ దశలో ఓడిపోయినప్పటికీ.. జట్టు అత్యుత్తమ క్యారెక్టర్ చూపెట్టి అద్భుతంగా పుంజుకుందని తెలిపాడు. ఫైనల్లో బ్యాటింగ్ అద్భుతంగా ఉన్నా బౌలింగ్ కాస్త నిరాశపరిచిందని, అయితే అంతిమంగా ట్రోఫీ గెలవడం ముఖ్యమని తిలక్ పేర్కొన్నాడు.






