అంతా బూటకం.. రైతులను మోస్తున్నారు: మాజీ సీఎం ఆందోళన

by Vemula.Srinu Prasad |

పీఎమ్ కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసి రైతులకు తాము అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అందంతా మోసమని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కొట్టిపారేశారు. ..

అంతా బూటకం.. రైతులను మోస్తున్నారు: మాజీ సీఎం ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: పీఎమ్ కిసాన్ (Pm Kisan)- అన్నదాత సుఖీభవ నిధులు(Annadatha SukhiBhava Funds) విడుదల చేసి రైతులకు తాము అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అందంతా మోసమని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) కొట్టిపారేశారు. రైతుల(Farmers)ను మోసం చేయడంలో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) రికార్డులను ఆయనే తిరగరాశారని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ మోసమేనని మండిపడ్డారు. తాము మేనిఫెస్టోలో చెప్పినదాని కంటే ఎక్కువే చేశామని తెలిపారు. 53.58 లక్షల మందికి రైతుల భరోసా అందించామని చెప్పారు. కరోనా సమయంలోనూ వెనక్కి తగ్గలేదన్నారు. పీఎం కిసాన్ యోజనకు అదనంగా రూ. 20 వేలు ఇస్తామని మాట తప్పారని తెలిపారు. పథకం నుంచి 7 లక్షల మందిని తొలగించారని చెప్పారు. కౌలు రైతులు, గిరిజనులకు మొండిచెయ్యి చూపారని జగన్ విమర్శించారు. ఒక్క పంటకు సైతం గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారని చెప్పారు. ఫీడ్ ధరలు పెంచి ఆక్వా రైతుల(Aqua Farmers)ను నట్టేట ముంచారని జగన్ ఆరోపించారు.

Next Story