- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెక్స్ట్ లెవెల్‌లో ‘OG-2’.. స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్
ఈ క్రేజీ డిస్కషన్స్‌లో డైరెక్టర్ సుజీత్, హీరో పవన్ కళ్యాణ్‌తో పాటుగా సంగీత దర్శకుడు తమన్ కూడా భాగమయ్యారు.

దిశ, సినిమా: పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’కి సీక్వెల్ రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కాగా.. తాజాగా, పవన్ అభిమానులకు ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘ఓజీ యూనివర్స్’కు సంబంధించిన చర్చలు అధికారికంగా స్టార్ట్ అయినట్లు తెలుపుతూ చిత్రబృందం ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ క్రేజీ డిస్కషన్స్‌లో డైరెక్టర్ సుజీత్, హీరో పవన్ కళ్యాణ్‌తో పాటుగా సంగీత దర్శకుడు తమన్ కూడా భాగమయ్యారు.
ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెట్టింట అభిమానులు OG-2హ్యాష్‌ట్యాగ్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీక్వెల్ లేదా ప్రీక్వెల్ లైన్లపై చర్చిస్తున్నట్లు టాక్. ‘OG’ షూటింగ్‌లో జరిగిన ఆలస్యం.. సీక్వెల్ విషయంలో జరగకుండా.. మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సినిమాను త్వరగానే పూర్తి చేసేందుకు సుజీత్, తమన్ రంగంలోకి దిగడం ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ డిస్కషన్స్ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.






