కారు స్కూటీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు..

by Kodari Anjali |

కారు స్కూటీ ఢీకొని వ్యక్తికి తీవ్రమైన గాయాలైన ఘటన మండలంలోని నాగారం గ్రామంలో ఆదివారం జరిగింది.

కారు స్కూటీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు..
X

దిశ, వలిగొండ: కారు స్కూటీ ఢీకొని వ్యక్తికి తీవ్రమైన గాయాలైన ఘటన మండలంలోని నాగారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం గ్రామానికి చెందిన అవనగంటి మహేష్ సొంత పని నిమిత్తం నాగారం గ్రామం నుండి స్కూటీపై వలిగొండ వెళుతున్న క్రమంలో దుర్గమ్మ గుడి సమీపంలో భువనగిరి నుండి చిట్యాల వైపు వెళ్తున్న కారు స్కూటీని బలంగా ఢీకొట్టింది. మహేష్ రెండు కాళ్లు విరగడంతో ప్రైవేటు వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పథమ చికిత్స నిర్వహించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో అటు నుండి మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story