- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లూరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత
by Vemula.Srinu Prasad |
అల్లూరి జిల్లాలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. జిల్లాలో వాహన తనిఖీలు చేస్తుండగా కారులో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద కదలికలను గమనించారు...

X
దిశ, వెబ్ డెస్క్: అల్లూరి జిల్లాలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. జిల్లాలో వాహన తనిఖీలు చేస్తుండగా కారులో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద కదలికలను గమనించారు. వెంటనే వాహనంలో సోదాలు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. రూ. 5.6 కోట్ల విలువైన 1,125 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనంతో పాటు పట్టుకున్న గంజాయిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసుల వార్నింగ్, హెచ్చరిక
‘‘గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ఎక్కడికి తరలిస్తున్నారు.’’ అనే కోణంలో విచారణ చేస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంలో నిషేధమని, ఎన్నిసార్లు అక్రమ రవాణాను అడ్డుకున్నా, అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో పోలీసులు సీరియస్ అయ్యారు. అక్రమ రవాణా దారులకు హెచ్చరికలు జారీ చేశారు. గంజాయి, డ్రగ్స్ అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






