ప్రశాంతంగా జిల్లాలో నీట్ పరీక్ష

by Taduka Kalyani |

మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన నీట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగింది.

ప్రశాంతంగా జిల్లాలో నీట్ పరీక్ష
X

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన నీట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగింది. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఆదివారం మెదక్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించగా పరీక్షా కేంద్రాన్ని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, డీఎస్పీ ప్రసన్నకుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హుస్సేన్ , సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి పటిష్ట ప్రణాళిక ద్వారా సమావేశాలు నిర్వహించుకుని వివిధ శాఖల అధికారులకు సూచనలు సలహాలు అందించడం జరిగిందన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా వసతులు కల్పించినట్లు వెల్లడించారు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు అభ్యర్థులను ప్రవేశ ద్వారం వద్ద తనిఖీలు నిర్వహించి లోపలికి అనుమతించడం జరిగిందన్నారు పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ యంత్రాంగం 163 బి.ఎన్.ఎస్ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసి పటిష్ట భద్రత నడుమ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. 481 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా కేవలం 421 మంది మాత్రమే పరీక్షకు హాజరైనట్టు వివరించారు వివిధ కారణాల వల్ల 58 మంది గైర్హాజర్ కావడం జరిగిందని అన్నారు. నీట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు చెప్పారు.

Next Story