రొయ్యల ఫ్యాక్టరీలో ఘోరప్రమాదం.. గ్యాస్ లీకై ఏడుగురు మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-21 11:05:17  IST  )

తమిళనాడులోని తిరువళ్లూరులో ఉన్న సెయింట్ పీటర్ అండ్ పాల్ సీఫుడ్ ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిడెట్ అనే రొయ్యల ఫ్యాక్టరీలో ఘోరప్రమాదం జరిగింది.

రొయ్యల ఫ్యాక్టరీలో ఘోరప్రమాదం.. గ్యాస్ లీకై ఏడుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని తిరువళ్లూరులో ఉన్న సెయింట్ పీటర్ అండ్ పాల్ సీఫుడ్ ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిడెట్ అనే రొయ్యల ఫ్యాక్టరీలో ఘోరప్రమాదం జరిగింది. కంపెనీలో అమ్మోనియం గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు ఊపిరాడక స్పాట్లోనే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 70 మంది కార్మికులు ఉండగా.. 21 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో 40 మంది కార్మికులు కూడా అస్వస్థతకు గురవ్వగా వారందరినీ సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తూ ఫ్యాక్టరీ యజమాని సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రొయ్యల ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనపై సీఎం విజయ్ దిగ్భ్రాంతి చెందారు. వెంటనే ప్రమాదస్థలానికి వెళ్లాలని మంత్రులను ఆదేశించారు. అలాగే సహాయకచర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story