- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘యోగా డే’లో ప్రత్యేక ఆకర్షణగా సీఎం భార్య (వీడియో)
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబైలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు షాహిద్ కపూర్ సందడి చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబైలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు షాహిద్ కపూర్ సందడి చేశారు. వర్లిలోని డోమ్ (DOME), ఎస్పీపీ (SVP) స్టేడియంలో 'దివ్యాజ్ ఫౌండేషన్' (Divyaj Foundation) ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఘనంగా యోగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి, సామాజిక కార్యకర్త అమృతా ఫడ్నవీస్ నేతృత్వం వహించారు. ఈ ఫిట్నెస్ ఈవెంట్లో అమృతా ఫడ్నవీస్, ఆమె కుమార్తె దివిజా ఫడ్నవీస్‌తో కలిసి నటుడు షాహిద్ కపూర్ చురుగ్గా పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ముఖ్యమంత్రి భార్య..
ఈ వేడుకలో ముఖ్యమంత్రి భార్య అమృతా ఫడ్నవీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉత్సహంగా యోగాలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. యోగా అనేది భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో ఒక భాగమని గుర్తుచేశారు. "దివ్యాజ్ ఫౌండేషన్‌తో కలిసి ఇక్కడ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. యోగా ఎక్కడ పుట్టిందో మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇది అంతర్జాతీయ దినోత్సవం అయినప్పటికీ, మన దేశానికి చాలా పెద్ద రోజు. ఎందుకంటే యోగా అనేదీ మన పూర్వీకులు మనకు అందించిన భారతీయుల సొంత విద్య. ప్రతిరోజూ యోగా చేయడంతో పాటు, మన మూలాలను, మన ధర్మాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి" అని పేర్కొన్నారు. వీడియో






