- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములు కాపాడుదాం : ఎమ్మెల్యే నాయిని
అన్ని రాజకీయ పార్టీల నాయకులతో, ప్రజాసంఘాల నాయకులతో, విద్యార్థి సంఘాల నాయకులతో కమిటీ ఏర్పాటు చేసి నగరంలోని ప్రభుత్వ భూములను గుర్తించి కాపాడుదామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : అన్ని రాజకీయ పార్టీల నాయకులతో, ప్రజాసంఘాల నాయకులతో, విద్యార్థి సంఘాల నాయకులతో కమిటీ ఏర్పాటు చేసి నగరంలోని ప్రభుత్వ భూములను గుర్తించి కాపాడుదామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు పూర్తి వాస్తవాలు చెప్పకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు. అక్రమ సంపాదనతో కూడబెట్టిన డబ్బుతో ప్రజలకు తాత్కాలిక ప్రయోజనాల పేరుతో వస్తువులు పంపిణీ చేయడం సిగ్గుచేటని, అలాంటి కార్యక్రమాలకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరుకావడం బాధాకరమన్నారు. గతంలో కాంగ్రెస్ నాయకుల పై దాడులు చేసిన వ్యక్తులే నేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అని అన్నారు.
ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన కార్యక్రమాలను రాజకీయ వేదికలుగా మార్చి ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. ముఖ్యమంత్రి వద్ద ప్రత్యేకంగా చర్చించి జూన్ 12న రూ.19 కోట్ల నిధులు మంజూరు చేయించామని, వాటిని గత ప్రభుత్వ విజయాలుగా ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. వైఎస్ఆర్ నగర్ భూముల అంశం పై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కలిసి సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూముల పై సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు.నగరంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి, హైడ్రా తరహాలో తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించి పార్టీ కార్యాలయాలు నిర్మించిన చరిత్ర బీఆర్ఎస్‌కే ఉందని ఆరోపించారు.వరంగల్ నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం నిధులు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు దిగడం దురదృష్టకరమన్నారు.శాయంపేట భూ వివాదంలో నిజాలు ప్రజలకు తెలుసునన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించినట్లు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ అర్హులైన లబ్ధిదారులను గుర్తించి నిధులు విడుదల చేస్తోందన్నారు. మామునూరు విమానాశ్రయ అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహనీయులను గౌరవిస్తూ వారి సేవలను స్మరించుకుంటోందని తెలిపారు.వరంగల్ నగర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, పారదర్శక పాలన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అజిజ్ ఖాన్, రాష్ట్ర నాయకులు బోద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈవి. శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు తోట వెంకన్న, శ్రీమాన్, మానస రాంప్రసాద్, బంక సరళ సంపత్ యాదవ్, కట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






