మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి తప్పిన ప్రమాదం

by Ajay Maddhiboyina |

పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధ‌ర్ రెడ్డికి తృటిలో రోడ్డు ప్ర‌మాదం త‌ప్పింది. స‌త్య‌సాయి జిల్లా బుక్క‌ప‌ట్నం మండ‌లం బుచ్చ‌య్య‌గారిప‌ల్లి స‌మీపంలో ఆయ‌న కాన్వాయ్ ని టిప్ప‌ర్ ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదం నుండి శ్రీధ‌ర్ రెడ్డి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.

మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి తప్పిన ప్రమాదం
X

దిశ‌, వెబ్ డెస్క్: పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధ‌ర్ రెడ్డికి తృటిలో రోడ్డు ప్ర‌మాదం త‌ప్పింది. స‌త్య‌సాయి జిల్లా బుక్క‌ప‌ట్నం మండ‌లం బుచ్చ‌య్య‌గారిప‌ల్లి స‌మీపంలో ఆయ‌న కాన్వాయ్ ని టిప్ప‌ర్ ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదం నుండి శ్రీధ‌ర్ రెడ్డి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. కానీ ఆరుగురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఓ ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే వాహనం మాత్రం చాలా డ్యామేజ్ అయ్యింది. ముందు భాగంలో స్కార్పియో చాలా డ్యామేజ్ అయ్యింది. ఒక టైర్ కూడా పూర్తిగా ఊడిపోయి ప‌క్క‌న పడింది. వాహ‌నం తీరు చూస్తుంటే ఎక్క‌వ వేగంతోనే టిప్ప‌ర్ స్కార్పియోను ఢీ కొట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌మాదం నుండి శ్రీధ‌ర్ రెడ్డి బ‌య‌ట‌ప‌డ‌టంతో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే శ్రీధర్ రెడ్డి 2019లో పుట్టపర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు ఈయన కస్టమ్స్ అధికారిగా పనిచేశారు.

Next Story