- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెడ్‌పై కూర్చొని అందాలను హైలెట్ చేస్తున్న డింపుల్
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న డింపుల్ హయాతి కొత్త ఫోటోలు

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ డింపుల్ హయాతి కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంటూ వస్తోంది.
ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల్లో వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకోవడంతో పాటు గ్లామరస్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో రోజురోజుకూ ఆమె ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది.
ఈమె పోస్ట్ చేసిన ఎన్నో హాట్ ఫోటోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా డింపుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది. వాటిలో గ్రే-లైట్ చాక్లెట్ కలర్ పొట్టి డ్రెస్ ధరించి బెడ్‌పై కూర్చొని తన అందాలు హైలెట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోల్లో డింపుల్ ఎంతో స్టైలిష్‌గా కనిపించడంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం డింపుల్ హయాతి, శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోగి' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె 'మందారం' అనే పాత్రలో కనిపించనుంది.
కొన్ని రోజుల క్రితం విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. అందులో డింపుల్ ఆకట్టుకునే లుక్‌లో కనిపించడంతో ఈ చిత్రంలో కూడా ఆమె తన గ్లామర్‌తో ప్రేక్షకులను మెప్పించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ సినిమాతో డింపుల్ ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.
Photos Courtesy: Instagram






