వివాహితపై మామ, మరిది దాడి

by velandi.Saikiran |   (  Updated:2026-06-19 10:44:37  IST  )

జగిత్యాల జిల్లాలో ఓ వివాహితపై ఆమె మామ, మరిది దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారు.

వివాహితపై మామ, మరిది దాడి
X

దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల జిల్లాలో ఓ వివాహితపై ఆమె మామ, మరిది దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ త‌రుణంలో పోలీసులను ఆశ్రయించింది బాధితులు. ఇక‌ బాధితురాలు సంధ్య తెలిపిన వివరాల ప్రకారం.. గత 14 సంవత్సరాలుగా భర్త రాకేష్‌తో కుటుంబ వివాదాలకు సంబంధించిన కేసు కోర్టులో కొనసాగుతోంది. వీరికి 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల భర్తతో కలిసి జీవించాలనే ఉద్దేశంతో సంధ్య గురువారం అత్తింటికి వెళ్లింది. ఈ త‌రుణంలోనే మామ పందిరి శేఖర్, మరిది సతీష్ కలిసి తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించింది బాధితురాలు. తన ఫోన్ లాక్కొని జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా, మరోసారి ఇంటికి వస్తే చంపేస్తామని బెదిరిస్తూ మరిది సతీష్ గొంతు నొక్కాడని సంధ్య ఆరోపించింది. ఇక ఈ సంఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.





Next Story