ఈ నెల 30న రాష్ట్రానికి ద్రౌపది ముర్ము.. సీఎం సహా అంతా ఆ కార్యక్రమం కోసమే..

by Naga Rani Yarlagadda |

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 30న విజయనగరం జిల్లా పర్యటనకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఈ నెల 30న రాష్ట్రానికి ద్రౌపది ముర్ము.. సీఎం సహా అంతా ఆ కార్యక్రమం కోసమే..
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 30న విజయనగరం జిల్లా పర్యటనకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. స్థానికంగా ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొననున్నారు. వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన 400 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు, 15 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్, మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలో జిల్లాలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 10 రోజుల్లోనే రాష్ట్రపతి రానుండటం, వర్సిటీ స్నాతకోత్సవాలని సీఎం సహా.. పలువురు మంత్రులు రానున్న క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్త్ ఏర్పాట్లు చేయనున్నారు.

Next Story