బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం

by Batti.Sumithra |

నర్సాపూర్ పట్టణంలోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని నర్సాపూర్ నియోజకవర్గ గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు శివాజీ నాయక్ ఆరోపించారు.

బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం
X

దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ పట్టణంలోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని నర్సాపూర్ నియోజకవర్గ గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు శివాజీ నాయక్ ఆరోపించారు. శుక్రవారం నాడు పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు శాతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు సుమారు 460 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 120 మంది మంది విద్యార్థులు మాత్రమే ఉండడం ఏంటని ప్రశ్నించారు. గతంలో మేము ఆ పాఠశాలలు చదువుకున్నప్పుడు 500 మంది విద్యార్థుల సంఖ్య ఉండేదని గుర్తు చేశారు. ఒక్కో తరగతిలో 80 మంది విద్యార్థుల వరకు అడ్మిషన్స్ ఉండేవని అన్నారు. పాఠశాలలో అడ్మిషన్ విషయంలో సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించి బ్యాక్ లాగ్ తో పాటు అడ్మిషన్ల సంఖ్య పెరిగేలా చూడాలని కోరారు.

Next Story