- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు నాగర్‌కర్నూల్‌లో మంత్రి సీతక్క పర్యటన
రాష్ట్ర మంత్రి సీతక్క ఈ నెల 22వ తేదీ సోమవారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమాల్లో పర్యటించనున్నట్లు నాగర్‌కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు.

దిశ, నాగర్ కర్నూల్: రాష్ట్ర మంత్రి సీతక్క ఈ నెల 22వ తేదీ సోమవారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమాల్లో పర్యటించనున్నట్లు నాగర్‌కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు మహిళా సంక్షేమం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు మంత్రి సీతక్క పరిశీలించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉదయం 10 గంటలకు తాడూరు మండలంలోని సిర్సవాడ గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ దుందుభి వాగు పై రూ.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి (హెచ్‌ఎల్‌బీ) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
అక్కడి నుంచి నాగర్‌కర్నూల్ పట్టణానికి చేరుకుని మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా ప్రతిపాదించిన రూ.5 కోట్ల వ్యయంతో కూడిన ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను పరిశీలించనున్నారు. తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులకు భద్రత, రక్షణ, మానసిక పరామర్శ, న్యాయ సహాయం మరియు పునరావాస సేవలను ఒకే వేదికపై అందించేందుకు ఏర్పాటు చేయనున్న భరోసా సెంటర్‌కు మంత్రి సీతక్క శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నాగర్‌కర్నూల్ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి చేరుకోనున్నట్లు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.






