- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రంపై విమర్శలు ఫ్యాషన్ అయిపోయింది.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) నేతలకు ఫ్యాషన్ అయిపోయందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశఆరు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని స్పష్టం చేశారు. అయితే, గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని, అదో ఫ్యాషన్ అయిపోయిందని బండి సంజయ్ మండిపడ్డారు. హైదరాబాద్ హైటెక్ సిటీ (Hitech City)అభివృద్ధిపై కేటీఆర్ (KTR) చేస్తున్న వ్యాఖ్యలకు బండి సంజయ్ బలమైన కౌంటరిచ్చారు. హైటెక్ సిటీకి ఐటీ కంపెనీలన్నింటినీ తానే తీసుకువచ్చానని కేటీఆర్ చెప్పుకుంటున్నారు, కానీ అది నిజం కాదన్నారు. విదేశీ కంపెనీలు ఎప్పుడైనా కేంద్రంలో ఉన్న బలమైన ప్రభుత్వాన్ని, దేశ నాయకత్వాన్ని చూసి పెట్టుబడులు పెట్టడానికి వస్తాని కామెంట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదనే విమర్శల్లో నిజం లేదని సంజయ్ కొట్టిపడేశారు.
రూ.8 లక్షల కోట్లకు తెలంగాణ అప్పులు..
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బండి సంజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.6 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆ అప్పుల భారం ఏకంగా రూ.8 లక్షల కోట్లకు చేరిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రం ఇంతటి భారీ అప్పుల్లో కూరుకుపోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల వైఫల్యాలే కారణమని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చే పరిస్థితిలో ప్రస్తుతం లేదన్నారు. కేంద్ర నిధులను వాడుకుంటూనే, రాజకీయాల కోసం మాపై విమర్శలు చేయడం ఈ ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని ఆయన బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.






