నశా ముక్త్ భారత్ అభియాన్.. పోస్టర్‌ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

by Kodari Anjali |

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నశా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

నశా ముక్త్ భారత్ అభియాన్.. పోస్టర్‌ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
X

దిశ, ఖమ్మం కల్చరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నశా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ ఇన్‌చార్జి శ్రీమతి కనకలక్ష్మి, జిల్లా యువజన, క్రీడల అధికారి శ్రీ సునీల్ రెడ్డి గారు, బ్రహ్మాకుమారి అరుణ ఇంచార్జ్ ఖమ్మం బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులు పాల్గొన్నారు. యోగం, ధ్యానం, సానుకూల ఆలోచనలు, దృఢమైన మనోబలం ద్వారా వ్యసనాలకు దూరంగా ఉండవచ్చనే సందేశాన్ని నశా ముక్త్ భారత్ అభియాన్ ద్వారా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Next Story