- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
by Kodari Anjali |
మాదారం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

X
దిశ, ములకలపల్లి: మండలంలోని మాదారం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. భద్రాచలం ప్రాంతానికి చెందిన వీరు ములకలపల్లిలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళ్తుండగా.. కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






