రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

by Taduka Kalyani |

రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటుందని నిర్మల్ డిసిసి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
X

దిశ, ఉట్నూర్ : రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటుందని నిర్మల్ డిసిసి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాలో పర్యటనలో అనేక డైలాగులు మాట్లాడుతూ.. రాజకీయ ప్రసంగం చేశారన్నారు. గత ప్రభుత్వం రైతులను రైతు భరోసా పేరుతో నానా ఇబ్బందులు పెట్టిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు మద్దతు ధర కల్పించడంతోపాటు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటుందన్నారు. ఇటీవల సిరికొండ మండలంలో పాండు రంగ్ అనే రైతు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు రాజకీయ డ్రామా కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని దీనికి కాలేశ్వరం ప్రాజెక్టు నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు చోటు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఖండిస్తున్నామని, విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దాసర్ల ప్రభాకర్ జిల్లా, మండల నాయకులు లింగంపల్లి చంద్రయ్య, రాజేశ్వర్, ఏక్బాల్, ఎస్పీ రెడ్డి, జగదీష్ జాదవ్ తదితరులు ఉన్నారు.

Next Story