- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SEBI: అన్‌లిస్టెడ్ షేర్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లపై సెబీ హెచ్చరిక
ఇటువంటి ప్లాట్‌ఫారమ్‌లకు సెబీ నుంచి ఎలాంటి గుర్తింపు లేదా అనుమతి లేదని, వాటి ద్వారా లావాదేవీలు చేయడం లేదా వ్యక్తిగత, ఆర్థిక వివరాలను పంచుకోవడం ప్రమాదకరమని స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: సెబీ అనుమతి లేని వెబ్‌సైట్‌లు, యాప్‌లు లేదా ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అన్‌లిస్టెడ్ షేర్లు కొనుగోలు, విక్రయాలు చేయడంపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మరోసారి హెచ్చరించింది. ఇటువంటి ప్లాట్‌ఫారమ్‌లకు సెబీ నుంచి ఎలాంటి గుర్తింపు లేదా అనుమతి లేదని, వాటి ద్వారా లావాదేవీలు చేయడం లేదా వ్యక్తిగత, ఆర్థిక వివరాలను పంచుకోవడం ప్రమాదకరమని స్పష్టం చేసింది. ఇప్పటికే 2016, 2024ల్లో కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అన్‌లిస్టెడ్ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌ను ప్రోత్సహించే అనధికారిక ప్లాట్‌ఫామ్‌లు ఇంకా కొనసాగుతున్నాయని సెబీ పేర్కొంది. ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెట్టే వారికి నియంత్రణ సంస్థల రక్షణలు అందుబాటులో ఉండవని సెబీ గుర్తుచేసింది. అంటే, వివాదాలు తలెత్తినా ఇన్వెస్టర్ల ఫిర్యాదుల పరిష్కారం, ఆన్‌లైన్ వివాద పరిష్కార వ్యవస్థలు లేదా స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా లభించే రక్షణలు వర్తించవు. నిధుల సమీకరణ, షేర్ల ట్రేడింగ్ కోసం గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకే చట్టబద్ధ అధికారం ఉందని సెబీ ప్రస్తావించింది. గతంలో పేపర్ ట్రేడింగ్, వర్చువల్ ట్రేడింగ్, ఫాంటసీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, అలాగే లిస్టింగ్ అవ్వని ఆన్‌లైన్ డెట్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌లపై కూడా సెబీ ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసింది.






