బీజేపీకి గుడ్‌బై.. జనసేన గూటికి పటాన్‌చెరు యువ నాయకురాలు

by Ramesh Naini |

తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన యువ నాయకురాలు, సామాజిక కార్యకర్త తనూజ రెడ్డి ఇటీవల రాజీనామా చేశారు.

బీజేపీకి గుడ్‌బై.. జనసేన గూటికి పటాన్‌చెరు యువ నాయకురాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన యువ నాయకురాలు, సామాజిక కార్యకర్త తనూజ రెడ్డి ఇటీవల రాజీనామా చేశారు. అనంతరం తాజాగా పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆమె జనసేన కండువా కప్పుకున్నారు.

బీజేపీకి గుడ్‌ బై..

కేవలం నాలుగు నెలల క్రితమే బీజేపీలో చేరిన తనూజ రెడ్డి, జూన్ 8వ తేదీన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్లే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ స్వల్ప కాలంలో తనకు లభించిన అవకాశాలకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరారు.

స్థానికంగా చర్చనీయాంశం..

ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ సామాజిక కార్యకర్తగా యువతలో తనూజ రెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు బీజేపీలో చేరిన ఆమె.. ఇంత స్వల్ప వ్యవధిలోనే ఆ పార్టీని వీడి జనసేన తీర్థం పుచ్చుకోవడం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story