- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశాంతంగా ముగిసిన నీట్ రీ ఎగ్జామ్.. కన్నీటితో వెనుదిరిగిన అభ్యర్థులు
నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో 3.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ దేశవ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్స్.. ప్రశాంతంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా 551 నగరాల్లోని 5440 కేంద్రాలతో పాటు.. విదేశాల్లో 14 ప్రాంతాల్లో ఈ పరీక్షలు జరగ్గా.. 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైనట్లు NTA వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో 3.65 లక్షల మంది విద్యార్థులు నీట్ రీ ఎగ్జామ్ కు హాజరయ్యారు. కాగా.. దివ్యాంగులకు పరీక్ష రాసేందుకు సాయంత్రం 6.20 గంటల వరకూ NTA అనుమతి ఇచ్చింది. పరీక్షా కేంద్రాల నుంచి బయటికి వచ్చిన విద్యార్థులు బయాలజీ పేపర్ ఈజీగా వచ్చిందని, కెమిస్టీ, ఫిజిక్స్ పేపర్లు టఫ్ గా వచ్చాయని చెప్తున్నారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకూ పరీక్ష జరగ్గా.. పరీక్షా కేంద్రాల్లో ఏఐ ఆధారిత నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, సీసీటీవీ కవరేజ్, సిగ్నల్ జామర్లు, ప్రత్యేక తనిఖీ బృందాలు, డాగ్ స్క్వాడ్స్ తో పాటు పెద్ద ఎత్తున పోలీసులతో భద్రతను కల్పించింది.
కాగా.. కొన్ని ఎగ్జామ్ సెంటర్లకు అభ్యర్థులు 1.30 గంటల తర్వాత రాగా.. వారిని సెక్యూరిటీ, పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా కన్నీరు పెట్టుకున్నారు. ప్లీజ్ వెళ్లనివ్వండి అని ప్రాధేయపడినా.. మళ్లీ ఏడాదికాలం ఎదురుచూడాలని, దయచేసి లోపలికి పంపాలని రిక్వెస్ట్ చేసినా పంపకపోవడంతో.. కన్నీళ్లతోనే వెనుదిరిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా.. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకవ్వడంతో.. ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా అనేకమంది నీట్ అభ్యర్థులు తమ కష్టమంతా కొందరి స్వార్థం వల్ల వృథా అయిందంటూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరోవైపు నీట్ రీ ఎగ్జామ్ పై నమ్మకం ఉంచాలని, అభ్యర్థులంతా ప్రశాంతంగా ఉండాలని, పరీక్షా విధానంపై నమ్మకం ఉంచాలని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు.






