- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ నుంచి రాజ్యసభకు.. క్లారిటీ ఇచ్చిన మీనాక్షి నటరాజన్
తాను రాజ్యసభకు వెళ్లేలా తెలంగాణ నుంచి ఒకరు రాజీనామా చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై మీనాక్షి నటరాజన్ స్పందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్‍లో తాను దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో తెలంగాణ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ స్పందించారు. తన కోసం ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో ఎవరు నాకోసం రాజ్యసభకు రిజైన్ చేయడం లేదని, ఒక వేళ రాజీనామా చేసినా తాను ఆ స్థానాన్ని తీసుకోనని చెప్పారు. ఈ విషయంలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. నా రాజకీయం మధ్యప్రదేశ్‍లో ఉంటుందని చెప్పారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆమె నేను ఒక్కరితో రాజీనామా చేయించి రాజ్యసభ సీట్ తీసుకునే అవసరం నాకు లేదన్నారు.
ఎవరు లీక్ చేయలేదు:
నామినేషన్ తిరస్కరణపై నేను ఇప్పటివరకు తక్కువగా మాట్లాడానని ఈ ఇష్యూ కోర్టులో ఉందని మాట్లాడలేదని చెప్పారు. మధ్యప్రదేశ్ లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉంటే ఒక్క స్థానానికి 58 సభ్యులు కావాలి. కాంగ్రెస్‍కు బలం ఉందని నాకు టికెట్ ఇచ్చారు. కానీ బీజేపీకి మూడో స్థానానికి అవకాశం లేకపోయిన ఫౌల్ గేమ్ ప్లాన్ చేసే బీజేపీ మూడో నామినేషన్ వేశారని ఆరోపించారు. డబ్బులతో, బెదిరింపులతో మూడు స్థానం రాదని బీజేపీ గ్రహించిందని అందుకే నా విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ కంప్రమైస్ అయ్యిందని ఆరోపించారు. తప్పుడు కేసులు కూడా కోర్టులో ఫైల్ చేస్తారు. నాపై క్రిమినల్ కేసులు లేవు. కేవలం నోటీసు ఇచ్చారు. తనపై కేసు నమోదైనట్లు తమకు లీక్ ఇచ్చారంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణవలను మీనాక్షి ఖండించారు. ఎవరు ఎందుకు లీక్ చేస్తారు? అక్కడ కాంగ్రెస్‍కు ఉంది ఒక్క సీట్. నేనే ఆర్వోకి చెప్పాను. ఆర్వోలు బీజేపీకి కంప్రమైస్ అయ్యి ఇలా చేశారని ఆరోపించారు. ప్రీ కాగినిస్‍లోనే కేసు ఉందని చెబితే ఫామ్ 26లో ఇలాంటి కేసులు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదని అధికారి చెప్పారన్నారు. ఎఫ్ఐఆర్ కాలేదు, ఆ కేసు 2016 లోది నేను ఇన్ ఛార్జ్ గా వెళ్లకముందు కేసు అని చెప్పానన్నారు. ఈ పుకార్లు నామినేషన్ రిజెక్ట్ కి ఒక్క రోజు ముందు నుండే బీజేపీ ప్రచారం చేస్తుంది. ఈ విషయంలో మీరు ఎలక్షన్ కమిషన్‍కు వెళ్ళి ఫిర్యాదు చేయాలనీ సుప్రీం కోర్టు చెప్పిందన్నారు.
అందుకే టికెట్ ఇవ్వలేదు:
కుంభం శివ కుమార్ ఇష్యూలో కేసు సీరియస్ అని గ్రహించి నారాయణపేట టికెట్ ఇవ్వలేదు. కుంభం శివ కుమార్‍పై ఎలాంటి కేసు ప్రూవ్ కాలేదు, ఛార్జ్ షీట్ లేదన్నారు. ఒక వ్యక్తి పై ఉన్న అభియోగాలకు కుటుంబంలోని వారికి టికెట్ ఇవ్వకూడదని ఎక్కడ లేదు. రాజ్యసభ తిరస్కరణ విషయంలో మేము ఒక్క నిమిషం కూడా నిరాశ చెందలేదు. ఎందుకంటే బీజేపీ ఎలాంటి రాజకీయం చేసిందో దేశానికి చూపించామన్నారు. ఓటు చోరీ, సీట్ చోరీ జరుగుతోందని రెండేళ్ల నుండి రాహుల్ గాంధీ చెప్తున్నారన్నారు.






