- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేలాదిగా చేపలు మృతి... విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశం
అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపల మృతి కలకలం రేగింది. సముద్రంలో వేలాదిగా చేపలు మృతి చెంది ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో స్థానిక మత్య్సకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ..

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli District) బోయపాడు తీర ప్రాంతంలో చేపల మృతి కలకలం రేగింది. సముద్రం(Sea)లో వేలాదిగా చేపలు మృతి చెంది ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో స్థానిక మత్య్సకారులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జీవనాదారమైన చేపలు టన్నుల కొద్ది చనిపోవడంతో లబోదిబోమంటున్నారు.
ఘటనపై పవన్ ఆరా
అయితే ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలిసింది. దీంతో ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం విచారణ చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. చేపల మృతి కారణాలు తెలుసుకోవాలని, విచారణ అనంతరం నివేదిక ఇవ్వాలని సూచించారు. అలాగే నిపుణులతో అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మెరైన్ సెంటిస్టులు, మత్య్సశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నివేదికలు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ల్యాబ్‌కు చేపల శాంపిల్స్
దీంతో రంగంలోకి దిగిన అధికారులు చేపల మృతి ప్రాంతాన్ని పరిశీలించారు. నీటి నమూనాలు, మృతి చెందిన చేపల శాంపిల్స్ సేకరించారు. అనంతరం పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు.






