సాయికృష్ణ కేసులో వెలుగులోకి కీలక విషయాలు!

by Ajay Maddhiboyina |

విజ‌య‌వాడ రౌడీ షీటర్ సాయికృష్ణ కేసులో కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. సాయికృష్ణ కేసులో కీలకంగా మార్కాపురం టు విజయవాడ ఎపిసోడ్ కీల‌కంగా మారింది.

సాయికృష్ణ కేసులో వెలుగులోకి కీలక విషయాలు!
X

దిశ‌, వెబ్ డెస్క్: విజ‌య‌వాడ రౌడీ షీటర్ సాయికృష్ణ కేసులో కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. సాయికృష్ణ కేసులో కీలకంగా మార్కాపురం టు విజయవాడ ఎపిసోడ్ కీల‌కంగా మారింది. టాస్క్ ఫోర్స్ ఎస్సై నవీన్ తో పాటు మ‌రో ఇద్ద‌రు కానిస్టేబుళ్లు మార్కాపురానికి వెళ్లారు. ఓ ప్రైవేట్ వాహనంలో మార్కాపురం నుంచి ఎస్సై న‌వీన్, ఇద్ద‌రు కానిస్టేబుళ్లు సాయికృష్ణను విజ‌య‌వాడ‌కు తీసుకువ‌చ్చారు. ఇప్పటికే అడిషనల్ డీసీపీ లతాకుమారి, ఎస్సై నవీన్, కానిస్టేబుళ్ల స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు.

ఎవరి ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ ఎస్సై న‌వీన్, కానిస్టేబుళ్లు మార్కాపురానికి వెళ్లారన్న దానిపై విచారణ కొన‌సాగుతోంది. ఇదిలా ఉంటే రౌడీ షీట‌ర్ సాయికృష్ణ‌ మిస్సింగ్ కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. సాయికృష్ణ‌ను సీఐ నాగ‌రాజు లాకప్ డెత్ చేశార‌ని బాధితుడి త‌ల్లి ఆరోపిస్తున్నారు. ఓ హోట‌ల్ లో బంధించి సాయికృష్ణ‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారని చెబుతున్నారు. త‌మ కుటుంబానికి న్యాయం చేయాల‌ని వేడుకుంటున్నారు. త‌న కుమారుడి అస్తిక‌లు అయినా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story