శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఉత్తమ మార్గం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

by Jakkula.Mamatha |

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని BRR డిగ్రీ కళాశాల స్టేడియం గ్రౌండ్‌లో జడ్చర్ల ఫ్లై వాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు.

శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఉత్తమ మార్గం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
X

దిశ,జడ్చర్ల: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని BRR డిగ్రీ కళాశాల స్టేడియం గ్రౌండ్‌లో జడ్చర్ల ఫ్లై వాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప జీవన విధానమని, ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని అన్నారు. నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, ప్రజలు పాల్గొని యోగా సాధన చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్లై వాక్ అసోసియేషన్ అధ్యక్షుడు కాల్వ.రాంరెడ్డి, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు.

Next Story