జాతీయ రహదారిపై అక్రమ అడ్డంకులు...

by Kodari Anjali |

‘ట్రాఫిక్‌కు తీరని తిప్పలు’ అనే దిశ కథనంపై అధికారులు చర్యలు చేపట్టారు.

జాతీయ రహదారిపై అక్రమ అడ్డంకులు...
X

దిశ, హస్తినాపురం: నాగార్జునసాగర్ జాతీయ రహదారి - బి.యన్.రెడ్డి నగర్, హస్తినాపురం నుండి సాగర్ రింగ్ రోడ్డు వైపు వచ్చే జాతీయ రహదారిలో సంతోషిమాత -X - రోడ్డు లో గత నెల రోజుల క్రితం నుండి ఒక షాపు యజమాని తన షాపు ముందు భాగంలో సిమెంటు దిమ్మె కట్టి, రోడ్డు కట్టంగా రాళ్లు నిర్మించడం జరిగింది. స్థానిక బస్తి ప్రజలు దిశ, దృష్టికి తీసుకురావడంతో ఈ మేరకు దిశ,లో గురువారం, శీర్షిక ప్రచురితం కావడంతో ఆయా శాఖల అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు. కానీ రాళ్లు మాత్రమే తొలగించారు. ఇంకా సిమెంటు దిమే అలాగే ఉంది.? అని ప్రజలు తెలియజేస్తున్నారు. అలాగే రోడ్డు మరమ్మతులు ఇంకా చేపట్టలేదు..? రోడ్డు మరమ్మతు కూడా వెంటనే చేపట్టాలని" ఫ్రీ లెఫ్ట్ సౌకర్యం కలిగించాలని" ఆయా బస్తీల ప్రజలు కోరుతున్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) అధికారులు ఇంకా మిగతా చర్యలు తీసుకుంటారని వేచి చూస్తున్నారు.

Next Story