- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ వడ్డీ వ్యాపారుల అరెస్ట్..
by Taduka Kalyani |
అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న అక్రమ వడ్డీ వ్యాపారులను ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

X
దిశ,ఆదిలాబాద్ : అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న అక్రమ వడ్డీ వ్యాపారులను ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇచ్చోడకు చెందిన అర్రోల్ల వెంకటరమణ, ఆయన కుమారుడు అర్రోల్ల ఉపేందర్‌లు బాధితుల నుంచి అధిక వడ్డీలు వసూలు చేయడంతో పాటు బెదిరింపులు, కులదూషణలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసులో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. నిందితుల ఇంటి నుంచి రూ.2 కోట్ల విలువైన 90 ప్రామిసరీ నోట్లు, 366 చెక్కులు, 26 ఖాళీ బాండ్ పత్రాలు, ఇతర కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అధిక వడ్డీలతో వేధింపులకు గురవుతున్న వారు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.
Next Story






