- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ కమలంలో ఒక రెక్క: టీపీసీసీ చీఫ్
తెలంగాణలో పవన్ కల్యాణ్ రాజకీయాలపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కమలం పువ్వులో ఒక రెక్క అని, ఆయన బీజేపీ ఆడిస్తున్న ఆటలో పావుగా మారి వారు చెప్పినట్లు ఆడుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. రాజకీయంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు జీర్ణించుకోవట్లేదన్నారు. తాజాగా ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు ఉపవాసం ఉన్నానని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ముందుండి నడిపిస్తే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ ప్రజలకు మరో పార్టీ అక్కర్లేదన్నారు. తాను చిరంజీవికి తాను అభిమానినని కానీ పవన్ కల్యాణ్ తెలంగాణ ఆవిర్భావం రోజే వచ్చే సభలు పెడతామంటే లా అండ్ ఆర్డర్‍కు విఘాతం కలగదా అని ప్రశ్నించారు.
సీఎం మార్పుపై..
కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలోనూ ముఖ్యమంత్రిని మార్చబోతున్నారనే ప్రచారంపై మహేశ్ కుమార్ స్పందించారు. ముందస్తు చేసుకున్న ఒప్పందంలో భాగంగానే కర్ణాటకలో సీఎం మార్పు జరిగిందన్నారు. అక్కడి పరిస్థితులు వేరు ఇక్కడి పరిస్థితులు వేరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని మోసం చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదన్నారు.






