భారీగా పెరిగిన విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్స్‌స్క్రైబర్స్.. నెల ఆదాయం తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం!

by Gantepaka Srikanth |

ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవలి కాలంలో ఆమెకు సంబంధించిన కొన్ని వార్తలు నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో, ఆమె ఇన్స్‌స్టాగ్రామ్ సబ్స్‌స్క్రైబర్స్ సంఖ్యతో పాటు నెలవారీ ఆదాయం కూడా ఊహించని స్థాయిలో భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

భారీగా పెరిగిన విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్స్‌స్క్రైబర్స్.. నెల ఆదాయం తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవలి కాలంలో ఆమెకు సంబంధించిన కొన్ని వార్తలు నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో, ఆమె ఇన్స్‌స్టాగ్రామ్ సబ్స్‌స్క్రైబర్స్ సంఖ్యతో పాటు నెలవారీ ఆదాయం కూడా ఊహించని స్థాయిలో భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇన్స్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా విష్ణుప్రియను ఫాలో అవుతున్న వారి సంఖ్య ప్రస్తుతం 7,414కి చేరింది. ఈ సబ్స్‌స్క్రైబర్ల ద్వారా ఆమెకు ఏకంగా రూ.28 లక్షల 91 వేల నెలవారీ ఆదాయం సమకూరుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ స్థాయిలో ఆదాయం ఆర్జించడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

వివాదాలు - విమర్శలు..

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో విష్ణుప్రియ చేసిన 'బాడీ కౌంట్' వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వైరల్ వార్తల నేపథ్యంలోనే ఆమె సబర్ల సంఖ్య అకస్మాత్తుగా పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, సబ్స్‌స్క్రైబర్ల కోసం ఆమె అందిస్తున్న ప్రత్యేక (ఎక్స్ క్లూజివ్) కంటెంట్‌పై నెటిజన్ల నుంచి కొన్ని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై విష్ణుప్రియ ఇప్పటికే చట్టపరమైన చర్యలకు దిగారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా, వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కంటెంట్‌ను వైరల్ చేస్తున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు, యూట్యూబ్ ఛానళ్లపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిని వదిలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు.




Next Story