ఫేక్ ప్రొఫైల్‌తో ప్రేమ నాటకం.. ఇద్దరు యువతులు బలి

by Batti.Sumithra |

సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసిన కేటుగాడు యువతులకు మోసం చేసి భారీ మొత్తంలోని డబ్బులు, బంగారాన్ని కాజేసిన ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో చోటుచేసుకుంది.

ఫేక్ ప్రొఫైల్‌తో ప్రేమ నాటకం.. ఇద్దరు యువతులు బలి
X

దిశ, టేక్మాల్ : సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసిన కేటుగాడు యువతులకు మోసం చేసి భారీ మొత్తంలోని డబ్బులు, బంగారాన్ని కాజేసిన ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి దుర్గయ్య ఇన్ స్టా గ్రామ్ లో తన పేరును రిత్విక్ రెడ్డిగా మార్చుకుని అదే గ్రామానికి చెందిన యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో తాను ఛత్తీస్ ఘడ్ లో ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉన్నానని నమ్మించాడు.

తనకి ఖర్చులకు డబ్బులు కావాలని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి 5 లక్షల రూపాయలు, తులం బంగారు కమ్మలను కాజేశాడు. అంతటితో ఆగకుండా, ఏ క్లాస్ పూర్ గ్రామానికి చెందిన మరో 17 ఏళ్ల బాలికకు సాత్విక్ రెడ్డి పేరుతో ఇన్ స్టాలో మరో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. ఆమె ఎక్స్పెక్ట్ చేయగా, తాను ఎంబీబీఎస్ చదువుతున్నానని ఖర్చులకు 7 లక్షల రూపాయలు కావాలని విడతల వారిగా తీసుకున్నాడు. అనంతరం ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో ఇద్దరు యువతులు మోసపోయామని గ్రహించి టేక్మాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Next Story