విద్యుత్ షాక్‌తో గాయపడిన సర్పంచ్

by Batti.Sumithra |   (  Updated:2026-06-19 12:15:33  IST  )

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మోటాట్‌పల్లి గ్రామంలో శుక్రవారం విద్యుత్ ప్రమాదంలో గ్రామ సర్పంచ్ గంధం భూమయ్య గాయపడ్డారు.

విద్యుత్ షాక్‌తో గాయపడిన సర్పంచ్
X

దిశ, భిక్కనూరు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మోటాట్‌పల్లి గ్రామంలో శుక్రవారం విద్యుత్ ప్రమాదంలో గ్రామ సర్పంచ్ గంధం భూమయ్య గాయపడ్డారు. గ్రామంలోని వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వైరు తెగిపోయినట్లు గుర్తించిన భూమయ్య, దానిని సరిచేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కారు. ఈ క్రమంలో పై భాగంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైరు కిందనున్న విద్యుత్ లైన్‌పై పడటంతో ఆయనకు తీవ్ర విద్యుత్ షాక్ తగిలింది. దీంతో స్తంభం పై నుంచి కింద పడిపోయి గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

Next Story